దీనుడా అజేయుడా_ dhenuda ajeyuda song lyrics_ hosanna ministries new song 2021
దీనుడా అజేయుడా_ dhenuda
ajeyuda song lyrics_ hosanna ministries new song 2021
పల్లవి: దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే
1: సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా
గమనములేని పోరాటాలే- తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా
హేతువేలేని - ప్రేమచూపించి- సెలువచాటునే దాచావు సంతోషము నీవే - అమృత సంగీతము
నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే
౹౹దీనుడా౹౹
2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద
కరుణనీడలో - కృపావాడలో - నీతోఉంటే చాలయ్యా
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా
౹౹ దీనుడా ౹౹
3. ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే - నయనోత్సవం
నీవేగా
ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా
0 కామెంట్‌లు