ఉదయకాలపు మంచు తెరవై
Apostle.ADAM BENNY Garu || Bro.PAUL BENNY Garu
VOL 14 #teluguchristiansong
ఉదయ కాలపు మంచు తెరవై - నన్ను చేరితివి కమ్ముకొంటివి ||2||
ఇది నీ ప్రేమ సంకల్పమే - దీవించేను నన్ను ||2||
నీ కృప ఆధారమై - బలపరిచెను ఇలలో ||2|| ||ఉదయ||
1.
నింగి నుండి కురియుచున్న - మంచు నీవేగా
ఆకలి తీర్చ ఆహారమైన - మన్నా నీవేగా ||2||
జీవాహారమై నన్ను - పోషించే తండ్రివై ||2||
నా యాత్రలో నా తోడువై - నడిపించే నా యేసయ్య ||2||
అందుకే హృదయ వందనము - హృదయ వందనము ||2|| ||ఉదయ ||
2.
అలసినప్పుడు పలకరించే - మంచి స్నేహితుడా
మరువకుండా కరుణ చూపే - ప్రేమ మూర్తివయ్య ||2||
నీ స్నేహ బంధాలతో - బంధించిన ప్రియుడా ||2||
ఆ స్నేహమే అనురాగమై - నడిపించు చున్నదయ్యా ||2||
అందుకే హృదయ వందనము - హృదయ వందనము ||2|| ||ఉదయ||
3.
చిగురు పెట్టు సరళవృక్షము - వంటి యేసయ్య
నీ ప్రేమ నీడలో ఆశ్రయం పొందితి - నా ప్రాణ ప్రియుడా ||2||
చెట్టుకు మంచు ఉన్నట్లు - నాతో నీవున్నావయ్యా ||2||
ఆశీర్వదించి - అభివృద్ధిపరిచి - విస్తరింపజేసితివే ||2||
అందుకే హృదయ వందనము - హృదయ వందనము ||2|| ||ఉదయకాలపు||
0 కామెంట్‌లు