Search This Blog

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS || HOSSANA MINISTRIES SONG LYRICS || 2022 HOSSANA MINISTRIES Songs || Hossana ministries new 2022 Songs Mp3 Songs || 🎵 LYRICS SONG lyrics



 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా

నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS 🎵 




 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా


నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)


నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే


నా యేసయ్యా సాత్వీకుడా


నీకోసమే నా జీవితం ||కరుణా||



1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము


నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2)


అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే


ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2)


ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||



2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని


ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2)


నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే


అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2)


ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||



3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై


నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2)


నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో


ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2)


తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా|



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram