Search This Blog

నమ్మి నమ్మి SONG LYRICS HOSSANA MINISTRIES SONG LYRICS

 




🙏✝ నమ్మి నమ్మి ✝🙏




పల్లవి: 
{నమ్మి నమ్మి - మనుషులను 
నీవు నమ్మి నమ్మి} [1] 
{పలుమార్లు 
మోసపోయావు} [2]
{ఇలా ఎంతకాలము నీవుA
సాగిపోదువు} [1] 
చరణం: 1
{రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను? 
దైవ దర్శనం కోల్పోయెను} [2]
{నా యేసయ్యాను నమ్మిన 
యెడల - ఉన్నత
బహుమానము నీకు
నిశ్చయమే} [1]
                 ||నమ్మి||
చరణం: 2
{ఐశ్వర్యము నమ్మి - వెండి
బంగారము ఆశించిన 
ఆకాను ఏమాయెను?
అగ్నికి ఆహుతియాయెను} [2]
{నా యేసయ్యాను నమ్మిన 
యెడల మహిమైశ్వర్యము 
నీకు నిశ్చయమే} [1]
                       ||నమ్మి|| 
చరణం: 3
{సుఖ భోగము నమ్మి 
ధనాపేక్షతో పరుగెత్తిన 
గేహజి ఏమాయెను?
రోగమును సంపాదించెను} [2] 
{నా యేసయ్యాను నమ్మిన 
యెడల శాశ్వతమైన ఘనత 
నీకు నిశ్చయమే} [1]
                      ||నమ్మి||
🙏 
x
x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram