🎵. *సమాధిని గెలిచిన యేసు*
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు-
లేతునని తాన్- చెప్పినట్లు
లేఖనములో పలికినట్లు..
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
1️⃣
భద్రముగా సమాధి పైన
పెద్ద రాతిని యుంచిరి భటులూ - (2)
ముద్ర వేసి రాత్రి అంతా
నిద్ర లేక కావాలియున్నా...!
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
2️⃣
ప్రభువు దూత పరము నుండి -
త్వరగా దిగి రాతిని పొర్లించి - (2)
భళిరే దానిపై కూర్చుండె
భయము నొంద కావలివారు
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
3️⃣
పాప భారము లేదు మనకు
మరణం భయము లేదు మనకు(2)
నరక బాధ లేదు మనకు(2)
మరువకండి యేసుప్రభుని
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
4️⃣
యేసునందే - రక్షణ భాగ్యం
యేసునందే - నిత్యజీవం(2)
యేసునందే - ఆత్మశాంతి(2)
యేసునందే - మోక్ష భాగ్యం
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
5️⃣
పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు(2)
పాపులను ప్రేమించినాడు(2)
ప్రాణదానం చేసినాడు
*లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*
🎤🎷🥁🎶🎸🎻🎺🪕🎤
0 కామెంట్‌లు