Search This Blog

GOOD FRIDAY SONG LYRICS కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా song

 పల్లవి:👨‍🎤👩‍🎤

{కల్వరి గిరిపై సిలువ భారం

భరించితివా ఓ నా ప్రభువా } [1]

{నా పాపముకై నీ రక్తమును

సిలువపైన అర్పించితివా } [2] 


చరణం:1️⃣

{దుష్టుండనై బల్లెము బూని

గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన } [2]

{కేక వేసి నీదు ప్రాణం

సిలువపైన అర్పించితివా } [2] 

                            |కల్వరి|


చరణం:2️⃣

{మూడు దినముల్ సమాధిలో

ముదముతోడ నిద్రించితివా } [2] 

{నా రక్షణకై సజీవముతో

సమాధిన్ గెల్చి లేచిన తండ్రి } [2]

                             |కల్వరి|


చరణం:3️⃣

{ఆరోహణమై వాగ్ధానాత్మన్

సంఘముపైకి పంపించితివా } [2] 

{నీ రాకడకై నిరీక్షణతో

నిందలనెల్ల భరించెదను } [2]

                         |కల్వరి|


🎤 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram