Search This Blog

YESU NANNU PREMINCHINAAVU Song lyrics

 

-

"YESU NANNU PREMINCHINAAVU Song lyrics" Song Info

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||

నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో||యేసూ||

తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ||యేసూ||

మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు||యేసూ||

నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము||యేసూ||

నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక||యేసూ

"YESU NANNU PREMINCHINAAVU Song lyrics" Song Video

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram