Siluvalo Vreeladee ॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Bro.YESANNA garu
సిలువలో - వ్రేలాడే నీ కొరకే
యేసు నిన్ను - పిలచుచుండె - ఆలస్యము నీవు చేయకుము
కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగు చునే
గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింస నొంది || సిలువ ||
నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును || సిలువ ||
అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధారా బోయుచునే || సిలువ ||
0 కామెంట్‌లు