యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకొనువారు ధన్యులు
Pʀᴀɪsᴇ Tʜᴇ Lᴏʀᴅ
దేవుని నామములో మీ అందరికి ఒక చిన్న మాట, పైన మన వాక్యంలో మనము చూసుకున్నట్లు అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకొనువారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనము చూసుకున్నట్లు అయితే ఎవరు ధన్యులు? మనకు నచ్చినట్లు మనము జీవించిన జీవితం మనకు అనుకూలంగా ఉండచ్చేమో కానీ ధన్యకరముగా ఉండదు. మరి ఎవరికి నచ్చినట్టు జీవించిన జీవితం ధన్యకరంగా ఉంటుంది అని మనము ఆలోచించినట్లు అయితే.. దేవునియందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో.. ఎందుకు భయభక్తులు అంటే మనలో చాలా మంది లో దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, మరి కుంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కానీ దేవుని వాక్యం ఏమి ఏమి చెప్తుంది అంటే దేవుని యందు ఎవరైతే భయభతులు కలిగి ఆయన ఏదైతే చెప్తున్నారో ఆయన చెప్పినట్లు జీవించిన వారి జీవితం ధన్యకరంగా ఉంటుంది అని వాక్యం చెప్పుతుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా;మరి నువ్వెలా ఉన్నావ్ ఆలోచించుకొని సరిచేసుకో. అట్టి కృప ధన్యత దేవుడు ఈ వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి దయచేయును గాక ఆమెన్..!
SUBSCIBE THE CHANEL
BLESSIE CREATIONS
0 కామెంట్‌లు