దేవుని రాకడకు ఆత్మీయ సిద్దపాటు కలిగి మనము ఉండాలి...short message by blessie creations
 ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ
                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈ లోకంలో మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక సిద్దపాటు కలిగి ముందుగానే అన్ని సిద్ధము చేసుకొని ఉంటాము. ఆలాగునే దేవుని రాకడకు ఆత్మీయ సిద్దపాటు కలిగి మనము ఉండాలి..ఈ లోకంలో చిన్న చిన్న వాటికొరకు, అశాశ్వతమైన వాటి కొరకు చాలా సిద్దపాటు కలిగి ఉంటావే..యుగయుగాలు ఉండాల్సిన, నిత్యము జీవించాల్సిన ఆ పరలోకరాజ్యము కొరకు ఇంకెంత సిద్దపాటును కలిగి ఉండాలి..? ఈరోజు నీ సిద్దపాటు ఎలా ఉంది ప్రియమైన సహోదరి, సహోదరుడా..! ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో..నీ ప్రవర్తను, మాటను, నడవడిక, ఆలోచించేవిధానం సమస్తం  దేవుని అధికారమునకు అప్పగించి దేవునికి నచ్చినట్టు జీవించి నీ భక్తి జీవితాన్ని కాపాడుకో.. ఎందుకంటే నువ్వు చేసే ప్రతీకార్యం మీద తీర్పు ఉంది అని గుర్తు పెట్టుకో.. కాబట్టి దేవునికి నచ్చినట్టు జీవిద్దాం. దేవుని రాజ్యంలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్..
STAY TUNED BY BLESSIE CREATIONS 



0 కామెంట్‌లు