పల్లవి:- నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును (2) నీ కాంతిలోనూ నిశ్చయతతోను (2) సాగెదను నీ త్రోవను యేసయ్యా...(2) (నీవెంటే నేను) చరణం:-1 పెనుగాలులందు తలదించకుందు నీ మాట నే నమ్ముకొందు ....(2) చలిరాత్రులందు చలియించకుందు శ్రమలైనను ఓర్చుకుందు (2) ఏ చర అయినా ఏ కరువయినా మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున.... (నీవెంటే నేను) చరణం:-2 అడ్డంకులందు చింతించకుందు నీ సాయమే కోరుకుందు...(2) ఇబ్బందులందు వెనుతిరగకుందు వాగ్దానముల ఆనుకొందు....(2) ఏ తెగులైన ఏ దిగులైనా మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున.... (నీవెంటే నేను) చరణం:-3 కారడవులందు భయపడకయుందు నీ నీడలో దాగుకొందు....(2) ఉపద్రవములందు తడబడకయుందు స్తుతి గీతమే పాడుకొందు....(2) ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యిన మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున.... (నీవెంటే నేను) x
0 కామెంట్‌లు