Search This Blog

చల్లగాలి నా మదినే తాకెను చలి రాతిరిలో చిరు నవ్వు పుట్టెను... CHRISTIAN Christmas song lyrics

 పల్లవి:-
చల్లగాలి నా మదినే తాకెను
చలి రాతిరిలో 
చిరు నవ్వు పుట్టెను...(2)
దూత చెప్పిన శుభవార్తకు
నా హృదయం ఉప్పొంగెను (2)
ఆ దూత🧚🧚 ఏమని చెప్పేను
పరిశుద్దుడు పుట్టెనని
పరవశించి చెప్పెను
మహారాజు వచ్చెనని
జగమంతా చాటెను (2)
(చల్లగాలి నా మదినే)
చరణం:-+01
కన్యక గర్భాన 
నా ప్రియుడు పుట్టినాడోయమ్మ 
నన్ను లాలించి పాలింప
వచ్చెనోయమ్మ (2)
అల్లారు ముద్దుగా 
అమ్మ ఒడిలో వాలెను
సత్రములో సంబరాలు సాగెను (2)
చిన్ని తండ్రి వచ్చెను
చింతలెల్ల బాపెను (2)
హొయ్...
(పరిశుద్దుడు పుట్టెనని)
చరణం:-+02
పసిప్రాయన ప్రవక్తలా
ప్రకటించేనోయమ్మ
ఆయన నోటితో పరలోక మార్గము
బోధించేనోయమ్మ (2)
తండ్రి చిత్తము నెరవేర్చ
సన్నిధిలో ఉండెను
రక్షకుని రాకతో లోకమంతా
సందడి చేసెను (2)
రక్షకుడు పుట్టెను
రక్షణే తెచ్చెను (2)
హొయ్...
(పరిశుద్దుడు పుట్టెనని)
x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram