రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ telugu christain christmas song lyrics 
పల్లవి:-
రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్ (2)
ఈలోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మనకొరకు దేవ దేవుడు
దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలిసి మురిసిపోయే
సంబరమాయెనే హొయ్....
(రారాజు పుట్టాడోయ్)
చరణం:-+01
వెన్నెల వెలుగుల్లో 
పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే 
గొల్లల సవ్వడులు 
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా 
మిన్నుల పండుగా 
సుక్కల్లో సంద్రుడల్లే  
సూడ సక్కనోడంట
పశువుల పాకలో(న) 
ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై.... 
(రారాజు పుట్టాడోయ్)
చరణం:-+02
మచ్చలేని ముత్యమల్లే 
పొడిసే సూరీడు
మనసులో దీపమై 
దారి చూపు దేవుడు 
ప్రేమ పొంగు సంద్రమల్లే 
కంటికి రెప్పలా
అందరి తోడు నీడై మారని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు 
పరమును వీడెనంట
మరువని బంధమై.....
(రారాజు పుట్టాడోయ్)
 
 
 
  
 
 
 
 
 
0 కామెంట్‌లు