సంబరమాయే మా ఊరంతా ఆ రక్షకుని రాకతో దేశమా 🇨🇮 ఆనందించుమా నేస్తమా ఆరాధించుమా పల్లవి:- ఆదియందు ఉన్న దేవుడు అద్వితీయ మహాదేవుడు మానవాళి ముక్తి కొరకు రక్షకుడై ఉదయించెను ఈ భువిపై (2) చీకటి పోయెను మా ఇంట నిండెను మా మది సంతోషంతో (2) క్రిస్మస్ సంబరమే మా ఊరంతా ఆ రక్షకుని రాకతో క్రిస్మస్ ఆనందమే మా ఇంట ఆ రక్షకుని వెలుగుతో ...(2) దేశమా 🇨🇮 ఆనందించుమా నేస్తమా ఆరాధించుమా ...(2) (ఆదియందు ఉన్న దేవుడు) చరణం:-+01 చీకటి పాపము తొలగించి వెలుగుతో మనలను నింపుటకై పాప శాపము పరిహరించి పరిశుద్దులుగా చేయుటకై (2) సర్వోన్నతమైన ఆ స్థలమును విడిచి పశువుల పాకకు ఏతెంచెను (2) ఎందరు అంగీకరించెదురో అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమిచ్చెను...(2) దేవుని పిల్లలగుటకు అధికారమిచ్చెను (చీకటి పోయెను) చరణం:-+02 మరణశ్చాయలు తొలగించి జీవము మనలో నింపుటకై అపరాధములన్ని తీసివేసి నీతిమంతులుగా చేయుటకు(2) తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును... ఓ...(2) ఎందరు నమ్మి విశ్వసించెదరో అందరికీ రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవమిచ్చెను...(2) రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవమిచ్చెను (చీకటి పోయెను)
0 కామెంట్‌లు