Search This Blog

ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |

పల్లవి:-

ఫలములనాశించిన పరలోక తండ్రి

తేరి చూచుచున్నాడు నీ వైపు (2)

ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి

పరీక్షించుచున్నాడు నీ కాపు (2)

ఫలియించకుండుట నీకు న్యాయమా

యజమాని సహనముతో చెలగాటమా (2)


చరణం:-1

ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు

సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)

చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)

తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)         

||ఫలియించకుండుట||


చరణం:-2

వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే

ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)

ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)

మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2)         

||ఫలియించకుండుట|| 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram