Search This Blog

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇల సంపాదన వదలవలయురా SONG LYRICS | gospelsongswithlyricS

TELEGRAM LINK FOR SONGS  

పల్లవి:-
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)
చరణం:-1
ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)       
||మనిషిగా||
చరణం:-2
జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)        
||మనిషిగా||
చరణం:-3
నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2)        
||మనిషిగా||
x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram