నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును SONG LYRICS 4U | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |
పల్లవి:-
నీవెంటే నేను నిబ్బరముగాను
నడిచెదను కడవరకును (2)
నీ కాంతిలోనూ నిశ్చయతతోను (2)
సాగెదను నీ త్రోవను యేసయ్యా...(2)
(నీవెంటే నేను)
చరణం:-1
పెనుగాలులందు తలదించకుందు
నీ మాట నే నమ్ముకొందు ....(2)
చలిరాత్రులందు చలియించకుందు
శ్రమలైనను ఓర్చుకుందు (2)
ఏ చర అయినా ఏ కరువయినా
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను)
చరణం:-2
అడ్డంకులందు చింతించకుందు
నీ సాయమే కోరుకుందు...(2)
ఇబ్బందులందు వెనుతిరగకుందు
వాగ్దానముల ఆనుకొందు....(2)
ఏ తెగులైన ఏ దిగులైనా
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను)
చరణం:-3
కారడవులందు భయపడకయుందు
నీ నీడలో దాగుకొందు....(2)
ఉపద్రవములందు తడబడకయుందు
స్తుతి గీతమే పాడుకొందు....(2)
ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యిన
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను)
0 కామెంట్‌లు