పల్లవి:-
అందాల తార ఆకాశంలో
మెరిసింది చూడు ఆ నింగిలో (2)
యేసయ్య జాడను
జ్ఞానులకు తెలిపేలా
ముస్తాబు అయ్యింది తార
బంగారు సాంబ్రాణి బోళము తీసుకొని
యేసుని చూద్దాం పదరా
Happy happy Christmas
Merry merry Christmas (2)
చరణం:-+01
లోక రక్షకుడు యేసు ని చూసి
పండుగ చేద్దాము
ప్రభుని చేరి పాటలు పాడి
నాట్యము చేద్దాము (2)
బెత్లహేములో పశుల పాకలో
సందడి చేద్దాం రారండి
యేసు రాజుని స్తుతికి పాత్రుని
మహిమపరచుదాం రారండి
చరణం:-+02
మహిమ దేవుని ఘనముగా పాడి
ఆరాధించెదము
గొప్ప రాజుకి కానుకలిచ్చి
ఆహ్వానించెదము (2)
భూలోకాలకి మనిషిగ వచ్చిన
యేసుని చూద్దాం రారండి
మోక్ష మార్గము రక్షణ ద్వారము
క్రీస్తును చేరిద్ధం రారండి
(అందాల తార)
0 కామెంట్‌లు