కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా } 2
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా } 2
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా } 2|| కలువరిగిరిలో ||
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } 2
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా } 2|| కలువరిగిరిలో ||
0 కామెంట్‌లు