*🎶 మాటల్లో చెప్పలేనిది!🎶*
పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
అ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||
1. స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య } 2
కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2
కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది } 2 || యేసూ నీ ప్రేమ ||
2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య } 2
లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
సిలువలో మరణించినది - శిక్షను భరియించినది } 2
0 కామెంట్‌లు