*🎶 కొండలలో లోయలలో !🎶*
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
1. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
2. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
3. వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
0 కామెంట్‌లు