✝ ఎగురుతున్నది విజయపతాకం✝ song lyrics
పల్లవి:{ఎగురుతున్నది విజయపతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం} [2]
{రోగ దుఃఖ వ్యాసనములను
తీసివేయును} [2]
{సుఖ జీవనం చేయుటకు
శక్తినిచ్చును} [2]
{రక్తమే.... రక్తమే... రక్తమే...
యేసు రక్తమే} [1]
{రక్తమే జయం - యేసు
రక్తమే జయం} [2]
చరణం: 1
{యేసుని నామం నుచరింపగానే
సాతానుని సైన్యము
వణుకుచున్నది} [2]
{వ్యాధుల బలము నిర్ములమైనది} [2]
{జయం పొందెడు నామము
నమ్మినప్పుడే} [2]
||రక్తమే||
చరణం: 2
{దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ
చేయుదం} [2]
{పాపపు క్రియలన్నిటిని
చెదరగొట్టిన} [2]
{క్రీస్తుని సిలువను మనము
అనుసరించెదం} [2]
||రక్తమే||
చరణం: 3
{మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా
ప్రీతితోను నీ హస్తము
చాపుము దేవా} [2]
{నీ పాద పద్మముపై చేరియున్న
ప్రజలను} [2]
{స్వస్థపరచుము తండ్రి
ఈక్షణమందే} [2]
||రక్తమే||
0 కామెంట్‌లు