కో:
{వాడుకో..... యేసయ్యా....
పొద్దు వాలిపోకముందే..
నన్ను వాడుకో.. యేసయ్యా...
నీ కాడి నే మోస్తానయ్యా...
నీ కాడి నే మోస్తానయ్యా...} [1]
పల్లవి:👨🎤👩🎤
{వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే
నన్ను వాడుకో } [2]
{వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తా } [2]
|వాడిపోక|
చరణం:1️⃣
{నీవిచ్చిన యవ్వన బలము
నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ
రెక్కలొచ్చి పోకముందే } [2]
|వాడుకో|
చరణం:2️⃣
{నీవిచ్చిన జీవితానికి
వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు
చీకటింక రాకముందే } [2]
|వాడుకో|
చరణం:3️⃣
{నీవిచ్చిన ప్రాణము
దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం
సంపూర్ణం కాకముందే } [2]
|వాడుకో|
0 కామెంట్‌లు