Lyrics:
నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం వినిపించు ఈ క్షణం నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ నామ ధ్యానమే సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
CREDITS:
Lyrics & Producer: Joshua Shaik
Music: Pranam Kamlakhar
Vocals: Mohammed Irfan
Keys: Mithun
Guitars : Keba Jeremiah
Veena Rajesh Vaidhya
Dholak Girish Vishwa
Tabla Sridhar Chari
Dholki: Omkar Ingwalekar
Shehnai Omkar Dhumal, Vijay Belbansi Strings: CHENNAI STRINGS
Chorus: Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga,
Supraja Sairam, Kavitha Illango
Studios & Sound Engineers:
Emsquare Studios, Mumbai by Bhasker
20 DB studios, Chennai by Avinash
Soundtown Dockk Studios, Chennai by Mithun & Vishnu
Mix & Mastered by A.P.Sekar at Krishan Digi Design
Studios, Chennai
Music Co-Ordinators: Vincent, Narender Video Shoot: Don Valiyavelicham
Video Edit: Priyadarshan PG
Title Design: SatishFX
0 కామెంట్‌లు