Search This Blog

YESU RAKSHAKA PRAANA SNEHITA | ఏసు రక్షక - ప్రాణ స్నేహిత నిన్ను విడిచి క్షణమైనా బ్రతుకలేనయ్యా || Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

 

Telugu worship song by Pas. Jyothi raju garu "YESU RAKSHAKA PRANAA SNEHITA " Which was Beautifully Lyric & Tune by Ps.Jyothi Raju . Watch and be blessed!



"YESU RAKSHAKA PRAANA SNEHITA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Info

Lyric & Tune

ఏసు రక్షక - ప్రాణ స్నేహిత //2//
నిన్ను విడిచి క్షణమైనా - బ్రతుకలేనయ్యా
నీ మాట లేక నిమిషం - జీవించలేనయ్య //2//
నా జీవము నీవే - నా ప్రాణము నీవే
నా సర్వము నీవే - యేసయ్యా //2//
చరణాలు:- ((ఏసు))
1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్
నేను నిన్ను మరువనంటివే //2//
తండ్రి ప్రేమ దూరమైన దూరమవును
అనాధలుగా విడువనంటివే //2//
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా సర్వము - నీవే యేసయ్యా //2//

2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా
భయపడకు జడియకంటివే //2//
కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన
కృప నిన్ను విడువదంటివే //2//
నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే
నా సర్వము నీవే యేసయ్యా //2//

3) వ్యాధులు నా వంటినిండా బాధించగా
స్వస్థపరచు వాడనంటివే //2//
ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా
నావన్నీ నీవంటివే //2//
నా బలము నీవే నా ధనము నీవే
నా సర్వము నీవే యేసయ్య //2//
(( ఏసు))

"YESU RAKSHAKA PRAANA SNEHITA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Video

Lyric & Tune : Ps.Jyothi Raju

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram