Yesu Nee Tyagame Song Lyrics | యేసు నీ త్యాగమే... నా పాప శిక్షకై | Bro James | యేసు నీ త్యాగమే... Song Lyrics

 

 

Yesu Nee Tyagame Song Lyrics


యేసు నీ త్యాగమే... నా పాప శిక్షకై... 2

ఎన్నో నిందలు అవి నా కోసమా... మలినమైన నా గతం ఇక లేదయ్యా... 2

  నా జీవితమే నీదేనయ్య...

  నాకంటూ ఏమొద్దయ్యా... 2


బంధువులే బాధించి ఎడబాసిన

నా వారే నన్నే అమ్మేసినా... 2

స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన

నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా... 2

   నా జీవితమే నీదేనయ్యా...

     నాకంటూ ఏమొద్దయ్యా... 2


బ్రతుకంతా చీకటి కమ్మేసినా

రాక్కసి వేదనలే శోధించినా... 2

రోదనలే రోగమై వేదించిన

మరణాలు విలయాలు కబళించినా... 2

     నా జీవితమే నీదేనయ్య...

       నాకంటూ ఏమొద్దయ్యా... 2


బలహీనతలో నను బలపరిచినా

పాపినైన నాకై మరణించిన... 2

మృతమైన నన్ను మహిమగా మార్చిన

మారని నీ ప్రేమకై బానిసైనా... 2

    నా జీవితమే నీదేనయ్యా...

       నాకంటూ ఏమొద్దయ్యా... 2

 

 

 




 






 
 
 
 
Yesu Nee Tyagame Song Lyrics
Yesu nee tyagame song lyrics english
Yesu Nee Tyagame Song Lyrics
Yesu nee tyagame song lyrics english download

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram