పల్లవి :-
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2)అ.ప.
ఉందిలే దీవెన – ఎందుకావేదన
పొందిన యాతన – దేవుడే మరచునా
చరణం :- 1
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు (2)
( ఉందిలే దీవెన )
చరణం :- 2
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
( ఉందిలే దీవెన )
0 కామెంట్‌లు