"LATEST WONDERFUL SONG "KALAYE NIJAMAYE" SONG BY PASTOR ADAM BENNY GARU ( 13TH ALBUM)" Song Info
కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా "2"
కన్నీరంతయు నాట్యముగా
మారి.." 2"
దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2"
1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2"
హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2" "కలయే"
2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2"
శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2" "కలయే"
3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2"
మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2" "కలయే"
0 కామెంట్‌లు