Search This Blog

Gathakalamantha ni needalona గతకాలమంత నీ నీడలోన

Gathakalamantha ni needalona 

గతకాలమంత నీ నీడలోన

 

 

గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram