చాలును చాలును నీ సన్నిదే చాలును song Lyrics
 చాలిన దేవుడవు నీవేనయ్య 
 చాలును చాలును చాలునేసయ్య
 1) దుఖంలోని నీ ఒదార్పు చాలును 
ఒంటరివేళ నీ తోడు చాలును
 అన్ని వేళల నన్నాదరించి
 నీ నోటి మాటలే నాకు చాలును ||చాలును||
2) ఎవరు లేని నాకు నీవే చాలును
ఏమి లేని నాకు ప్రేమే చాలను
ప్రతి క్షణమందు నన్ను బలపరచి 
నీ కనుచూపులే నాకు చాలును     ||చాలును||
3) అలసిన వేళ నీ బలము చాలును
 కృంగిన వేళ ని శక్తి చాలను 
 నిత్యము నాకు విజయము నిచ్చి
 నీ దివ్య సన్నిదే నాకు చాలును.    ||చాలును|| 

  

0 కామెంట్‌లు