Search This Blog

దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము దేవసుతుడు hebron christmas song


పల్లవి:-🎶🎵🎸

దేవసుతుడు యేసు జన్మించె 

నిరతము స్తుతియింతుము (2)

దేవసుతుడు


చరణం:-+01

పాపుల రక్షించ పరమ నాథుడు 

శ్రమలను పొందెను ఆ ...(2)

నశియించిన వారిన్ వెదకి రక్షింప 

రక్షకుడై పుట్టెను 

(దేవసుతుడు)


చరణం:-+02

బెత్లెహేములో నుత్తముడు జన్మించెను 

తండ్రి చిత్తము చేసెను ఆ ...(2)

భక్తులు పాదములకు మ్రొక్కిరి 

మనము స్తుతియింతుము

(దేవసుతుడు)


చరణం:-+03

ఘనుడు పుట్టెను పశుల పాకలో 

గొల్లలు పూజించిరి ఆ ...(2)

వేరే జనులు చోటీయకున్నను 

మనము స్తుతియించెదము (2)

(దేవసుతుడు)


చరణం:-+04

పుట్టినరాత్రి ప్రకాశమానం 

మృతిన్ పగటిలో ఆ ...(2)

స్తుతులకు తగిన శుద్ధుడు దూతల 

స్తుతులను బొందెన్ 

(దేవసుతుడు)


చరణం:-+05

నరులు బొంకినను వేదము బొంకదు 

నరుల హృదయమేమో ఆ ...(2)

పుణ్యుని జన్మము మీ మదినున్న 

పూజింతురు వాని

(దేవసుతుడు)


చరణం:-+06

అనాది దేవుని చిత్తముచే - 

శ్రీ యేసు బయలుపడెను ఆ ...(2)

జలనిధి వలెనే ఆయన జ్ఞానము 

మనలను నింపును

(దేవసుతుడు)


చరణం:-+07

ఆనందముగా యెహోవాకు 

హల్లెలూయ పాడెదము ఆ ...

హల్లెలూయ ఆమెన్

హల్లెలూయ ఆమెన్

హల్లెలూయ ఆమెన్

(దేవసుతుడు)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram