Search This Blog

దావీదు పురములో దేవూడు జన్మించె లోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే telugu christmas song lyrics


పల్లవి:-
దావీదు పురములో 
దేవూడు జన్మించె
లోక రక్షకుడు 
దివి నుండి దిగివచ్చే (2)
రారండి వేగమే వేడుక చూద్దాం 
సంతోష గానముతో 
నాట్యం చేద్దాం (2)
దావీదు పురములో
……యేసయ్యా
చరణం:-+01
దైవ దూత సందేశమిచ్చెను 
ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను
తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను 
గొల్లలంతా కూడి 
స్తుతియించ వచ్చెను
రారండి వేగమే వేడుక చూద్దాం
బంగారం సాంబ్రాణి 
అర్పించెదము (2)
దావీదు పురములో
……యేసయ్యా (2)
చరణం:-+02
కన్య మరియ గర్భాన పుట్టెను
నరరూపాన్ని ధరియించి వచ్చెను
పాపులను రక్షించ 
పరిశుద్ధుడే వచ్చేను 
లోకాన్ని విడిపించ 
రక్షకుడే వచ్చేను
రారండి వేగమే వేడుక చూద్దాం
పాపుల రక్షకున్ని దర్శించేద్దాం (2)
దావీదు పురములో….
చరణం:-+03
బాలుడు కాదయ్యా 
బలవంతుడు యేసయ్య
నరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యా
నరకాన్ని తప్పించ దివి నుండి వచ్చాడయ్యా 
సాతాన్ని జయించిన 
విజయ శీలుడయ్యా
రారండి వేగమే వేడుక చూద్దాం
రారాజుని ఘనపరిచి 
కీర్తించెదము (2)
దావీదు పురములో…..
……యేసయ్యా (2)
THANK YOU FOR VISITING 
x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram