చుక్కను చూసి వచ్చినాము  చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము  సాగిలపడి మ్రొక్కినాము  TELUGU CHRISTMAS SONG LYRICS 
పల్లవి:-
చుక్కను చూసి వచ్చినాము 
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము 
సాగిలపడి మ్రొక్కినాము (2)
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము 
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము (2)
చరణం:-+01
ప్రవక్తల నోటి నుండి 
పలికిన మాటలకు
ప్రభువైన యేసు 
రుజువుగా వచ్చినాడు (2)
చూసిన వారిని ఆశ్చర్యపరచి (2)
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా(2)
(శ్రీమంతుడొచ్చడని)
చరణం:-+02
పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు
పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో 
పవళించినాడు (2)
చూసిన వారికి 
చూడముచ్చట గొలిపి(2)
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా(2)
(శ్రీమంతుడొచ్చడని)
 
 
 
  
 
 
 
 
 
0 కామెంట్‌లు