Search This Blog

వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము చూపించు కార్యాన TELUGU CHRISTMAS SONG LYRICS


పల్లవి:-
వింతైన తారక వెలసింది గగనాన 
యేసయ్య జన్మ స్థలము 
చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు 
ఆ తార అనుసరణ 
దైవమే  పంపెనని 
గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా 
తారవలె క్రీస్తుని చాటుదాం 
Happy Christmas 
Merry Christmas 
We wish you Happy Christmas…
చరణం:-+01
ఆకాశమంతా ఆ దూతలంతా 
గొంతెత్తి స్తుతి పాడగా 
సర్వోన్నతమైన స్థలములలో 
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో 
ఉన్న గొర్రెల కాపరులన్ 
ముదముతో కలిసిరి 
జనన వార్త చాటిరి 
(మనమంతా)
చరణం:-+02
ఆ తూర్పు జ్ఞానులు 
ఆ గొర్రెల కాపరులు 
యేసయ్యను దర్శించిరి 
ఎంతో విలువైన కానుకలను 
అర్పించి రారాజును 
పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు 
శుభ వార్త చాటిరి 
అవనిలో వీరును 
దూతలై నిలిచిరి
(మనమంతా)

x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram