విన్నారా జనులారా  ఈ వార్త శుభవార్త  యేసయ్య జన్మించినాడు  SONG LYRICS TELUGU CHRISTMAS SONGS 
విన్నారా జనులారా  ఈ వార్త శుభవార్త  యేసయ్య జన్మించినాడు  SONG LYRICS
పల్లవి:-
విన్నారా జనులారా 
ఈ వార్త శుభవార్త (2)
యేసయ్య జన్మించినాడు 
రక్షకుడుదయించి నాడు (2)
బేత్లెహేములో పశులపాకలో
కన్యమరియ  గర్భమందున (2)
రారాజు జన్మించినాడు 
మనకై భువికొచ్చినాడు (2)
చరణం:+01
సర్వశక్తిగల యేసుదేవుడు 
సమస్తము చేయగల దేవుడు
పరలోకభాగ్యము వీడి 
దీనునిగా భువికొచ్చినాడు (2)
పాపమెరుగని పావనాత్ముడు
పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు
(యేసయ్య జన్మించినాడు)
చరణం:-+02
పాపులకై వచ్చిన దేవుడు 
ప్రేమించి కరుణించే దేవుడు
అంధకారమైన జీవితాలకు 
వెలుగుగా ఉదయించినాడు (2)
(మన) పాపదోషము పరిహరింపను
పరిశుద్ధులుగా 
మనల చేయను (2)
(యేసయ్య జన్మించినాడు)
 
 
 
  
 
 
 
 
 
0 కామెంట్‌లు