Search This Blog

రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి నాడట రక్షకుండుదయించి నాడు రారె - గొల్లబోయలార TELUGU CHRISTMAS SONGS


పల్లవి:-🎵🎶🎸

రక్షకుండుదయించి నాడట 

మన కొరకు బరమ

రక్షకుండుదయించి నాడట

రక్షకుండుదయించి నాడు

రారె - గొల్లబోయలార  (2)

తక్షణమున - బోయి మన 

నిరీక్షణ ఫలమొందెదము    

(..రక్షకుండు..)


చరణం:-+01

దావీదు వంశమందు 

ధన్యుండు జన్మించినాడు (2)

దేవుడగు  యెహోవా 

మన దిక్కు జేరి చూచినాడు    

(..రక్షకుండు..)


చరణం:-+02

గగనమునుండి దిగి 

ఘనుడు గబ్రియేలు దూత (2)

తగినట్టు  చెప్పె వారికి 

మిగుల సంతోషవార్త    

(..రక్షకుండు..)


చరణం:-+03

వర్తమానము జెప్పి దూత 

వైభవమున బోవుచున్నాడు (2)

కర్తను జూచిన వెనుక 

కాంతుము విశ్రమం బప్పుడు    

(..రక్షకుండు..)


చరణం:-+04

పశువుల తొట్టిలోన 

భాసిల్లు వస్త్రముల జుట్టి (2)

శిశువును గనుగొందురని 

శీఘ్రముగను దూత తెల్పె    

(...రక్షకుండు...)


అదనపు చరణం:-+05

అనుచు గొల్ల లొకరి కొక 

రానవాలు జెప్పుకొనుచు (2)

అనుమతించి కడకు క్రీస్తు 

నందరికినీ దెల్పినారు    

(...రక్షకుండు)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram