అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్.. TELUGU CHRISTMAS SONG

Search This Blog

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్.. TELUGU CHRISTMAS SONG


పల్లవి:-🎶🎵🎸

అందాల తార అరుదెంచె నాకై 

అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి 

అవని చాటుచున్...(2)

ఆనందసంద్ర ముప్పోంగెనాలో 

అమరకాంతిలో

ఆది దేవుని జూడ

అశింపమనసు పయనమైతిమి

(అందాల తార)


చరణం:-+01

యెరూషలేము రాజనగరిలో 

ఏసును వెదకుచు

ఎరిగిన దారి తొలగిన వేల 

ఎదలో కృంగితి

యేసయ్య తీర ఎప్పటివోలె 

ఎదురాయె త్రోవలో

ఎంతో యబ్బురపడుచు 

విస్మయ మొందుచు 

ఏగితి స్వామి కడకు

(అందాల తార)


చరణం:-+02

ప్రభుజన్మస్ధలము 

పాకయేగాని పరలోక సౌధమే

బాలునిజూడ జీవితమెంత

పావనమాయెను

ప్రభుపాదపూజ దీవెనకాగా

ప్రసరించె పుణ్యము

బ్రతుకె మందిరమాయె 

అర్పణలే సిరులాయె 

ఫలియించె ప్రార్ధన

(అందాల తార)


అదనపు చరణం:-+03

విశ్వాసయాత్ర దూరమెంతైన 

విందుగా దోచెను

వింతైన శాంతి వర్షించె నాలొ 

విజయపధమున

విశ్వాలనేలెడి దేవకుమారుని 

వీక్షించు దీక్షలో

విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ 

విశ్రాంతి నొసగుచున్

(అందాల తార)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram