పల్లవి:- {ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు జిగట మన్నైనా నీ పాత్రను } {రూపించెను తన సేవ కోసమే } [2] ||ఘనమైన || చరణం:1 {సృష్టిప్రధాతగా భువిలో మట్టిని ఊపిరి పోసి మనిషిగా చేసేను రూపొందించిన ప్రేమ హస్తాలను సిలువకు బంధించిన కారణం చూడు మేకులు దిగబడిన తన హస్తాలను నీదు నిమిత్తమే చాపి యున్నాడు ప్రేమతో నిన్ను పిలుచుచున్న దేవుడు కరుణతో నిన్ను అందరించు నాధుడు } ||ఘనమైన || చరణం:2 {విరిగిన పాత్రయని అర్హత లేదని కలవరపడకుము యేసు నిన్ను పిలిచేను విరిగి నలిగిన హృదయములే కదా క్రీస్తుకు ప్రియమైన బలిఅర్పణ కానుక కుమ్మరి చేతిలో నీవున్నావా విరిగిన నీలో పరిశుద్దత్మను అభిషేకతైలమే కుమ్మరించు వేళలో మహిమాత్మనోలికించు పాత్రగా చేయును }
0 కామెంట్‌లు