పల్లవి:-
కల్వరిగిరిపై నా యేసయ్య
నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా
నీప్రేమకు సాటేది ఓనజరేయా (2)
(కల్వరిగిరిపై)
చరణం:-+01
కాళ్ళకు మేకులు కొట్టిరా
తలపై ముళ్ళకిరీటమా
నేరమే ఏమిలేకనే
అయ్యో ఇంతటి ఘోరమా (2)
మా పాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ
మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా
నీప్రేమకు సాటేది ఓనజరేయా
(కల్వరిగిరిపై)
చరణం:-+02
తనువునే చీల్చి వేసిరా
రుథిరమే ఏరులైపారెనా
లోకమే ఏక మాయెనా
అయ్యో అంతటి ద్వేషమా (2)
మాపాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ
మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా
నీప్రేమకు సాటేది ఓనజరేయా
(కల్వరిగిరిపై)
0 కామెంట్‌లు