*🎶సిలువే నా శరనాయెను రా!🎶*
సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /
0 కామెంట్‌లు