Search This Blog

గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } నీ గానమే - యేసు నీ కోసమే నీ ధ్యానమే - యేసూ నీ కోసమే SONG LYRICS || TELUGU LYRICS CHRISTIAN


*🎶గళమెత్తి పాడినా!🎶*


గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } 2

నీ గానమే - యేసు నీ కోసమే

నీ ధ్యానమే - యేసూ నీ కోసమే


1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే

కృశియించిపోయే నాలో వసియించినావే } 2

నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్

నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||


2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే

గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2

నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్

నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||


3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే

కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2

నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్

నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram