పల్లవి:-
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ } [2]
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి
నను వరియించింది } [2]
{కలువరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ } [1]
|కనురెప్ప|
చరణం:1
{ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపులో నను మార్చియున్నది } [2]
{ప్రేమను మించిన ధైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని } [2]
{ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ } [1]
|కనురెప్ప|
చరణం:2
{ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది } [2]
{ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని } [2]
{పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ } [1]
|కనురెప్ప|
0 కామెంట్‌లు