Search This Blog

ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక TELUGU CHRISTIAN SONG LYRICS


*🎶ఆగిపోదు నా పాట!🎶*


ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక (2)

సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక (2)


1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను

అలసటతో జోగినా శృతి తగ్గనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||


2. నా అడుగు జారినా కలవరము చెందను

నా బలము పోయినా లయ తప్పనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||


3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను 

మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram