ఇది శుభోదయం  క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం  TELUGU CHRISTMAS SONGS LYRICS 
పల్లవి:-🎶🎵🎸
ఇది శుభోదయం 
క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం (2)
చరణం:-+01
రాజులనేలే రారాజు 
వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు 
నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో       
||ఇది||
చరణం:-+02
గొల్లలు జ్ఞానులు ఆనాడు 
ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు 
పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో       
||ఇది||
 
0 కామెంట్‌లు