పల్లవి:-
వెలుగులతో లోకమంతా
నిండెనే... నిండిపోయెనే
తన రాకతో పుడమి
పొంగిపోయెనే..పొంగిపోయెనే
లోకాలనేలేటి యేసయ్య పుట్టాడని
ఊరూరా తిరిగి చెప్పాలయ్య
గుండెలోని భాధలు తీసి..
గంతులేసి ఆడాలయ్యా
పండుగ చేద్దాము
మనమంతా కలిసి
మనమంతా కలిసి (2)
చరణం:-+01
సృష్టి అంత ఆహ్వానం అందించెనే
సృష్టికర్త ఇలలోకి వచ్చాడని
దూతలంత జనన వార్త చాటి చెప్పెనే
లోక రక్షకుడు నేడు పుట్టాడని
భాధలన్ని పోయే సంతోషం నిండెనే
మెస్సయ్యా మాకోసం వచ్చాడని
పాత బ్రతుకులన్ని కొత్తగా మార్చే..
యేసయ్య మాకోసం పుట్టాడని
(పండుగ చేద్దాము)
చరణం:-+02
చీకటి తెరలన్ని తొలగిపోయెనే
మహిమ స్వరూపుడే ఉదయించగ
పాపపు సంకెళ్లు తెగిపోయెనే
పావనుడేసయ్య అరుదించగా
నశియించిపోయే మానవాళిని
వెదకి రక్షించే రారాజయ్య
శిలువ శ్రమయైన ప్రేమతో భరియించ
కోరి కోరి వచ్చాడయ్య
(పండుగ చేద్దాము)
0 కామెంట్‌లు