పల్లవి:-
ఆ కలువరి మార్గములో
యేసు సిలువను మోసెను (2)
రక్షణ నివ్వను ఓ సోదరా
నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)
(ఆ కలువరి)
చరణం:-+01
మేకులు కొట్టిరి కాళ్ళకు
తలకు ముండ్ల కిరీటము (2)
యేసు రక్తము నదివలె
సిలువపై నుండి ప్రవహించె (2)
(ఆ కలువరి)
చరణం:-+02
పాపములోనే ఉందువా
పాపము వలన మరణము (2)
నీ పాపములను ఒప్పుకో
కడుగును యేసు రక్తము (2)
(ఆ కలువరి)
చరణం:-+03
గరుకు రాళ్ళ మార్గములో
బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి
దేహమంతా చీలెను (2)
(ఆ కలువరి)
చరణం:-+04
గాయపడిన చేతులు చాచి
ప్రభువు పిలచుచుండెను (2)
పాపపు స్థితిని మార్చను
నిత్య జీవము నివ్వను (2)
(ఆ కలువరి)
చరణం:-+05
హృదయ తలుపు తట్టుచున్నాడు
తెరువుము నీ హృదయము (2)
చేర్చుకొనుము యేసుని
శాంతి నీకు దొరుకును (2)
(ఆ కలువరి)
0 కామెంట్‌లు