పల్లవి:-
అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2)
అయ్యా
చరణం:-+01
పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు
తిరిగి లేచితివి (2)
అయ్యా వందనమయ్యా
చరణం:-+02
అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2)
అయ్యా వందనమయ్యా
0 కామెంట్‌లు