Good Friday SONG
పల్లవి:-
ఎంతో దుఃఖము బొందితివా
నాకొరకెంతో దుఃఖము పొందితివా (2)
యెంతో దుఃఖము నీకు
ఎంతో చింతయు నీకు
ఎంతో దిగులయ్యా నాకు
ఆ పొంతి పిలాతు
యూదులు నీకుఁ బెట్టిన
శ్రమలను దలపోయగా
(ఎంతో దుఃఖము)
చరణం:-+01
వచ్చిరి యూదులు
ముచ్చట లాడుచు
నెచ్చట వాడనుచు నిన్ను
మచ్చరముతో వారి
యిచ్చ వచ్చినట్లు
కొట్టి దూషించినారా
(ఎంతో దుఃఖము)
చరణం:-+02
సుందరమగు
దేహమందున దెబ్బలు
గ్రంధులు గట్టినవా నీవు
పొందిన బాధ నాడెందము తలప
నానందములే దాయెను
(ఎంతో దుఃఖము)
చరణం:-+03
నెపము బెట్టుచు దిట్టి
యపహసించుచు యూద
చపలులు గొట్టినారా
నా యపరాధములకు
నా పదలను బొంది
నీ కృప నాకుజూపినావా
(ఎంతో దుఃఖము)
చరణం:-+04
అన్నదమ్ములైన అక్క సెల్లెండ్రైన
కన్న పిత్రాదులైన
నన్ను ఎన్నడైన బ్రేమించలే రైరి
నా యన్నా ప్రేమించినావా
(ఎంతో దుఃఖము)
0 కామెంట్‌లు