Good Friday song
పల్లవి:-
ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణమంత
పంతముతో జేసిరంత
సొంత ప్రజలు స్వామినంత
(ఎంతో వింతా)
చరణం:-+01
మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపుపైని
మొయ్యలేక మ్రానితోడ
మూర్ఛబోయె నేసు తండ్రి
(ఎంతో వింతా)
చరణం:-+02
దాహముగొన జేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా
ధాత్రిప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా
(ఎంతో వింతా)
చరణం:-+03
బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారె నీరు రక్త మహహా
ఏరై పారె యేసురక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు
(ఎంతో వింతా)
0 కామెంట్‌లు