సింహపు పిల్లలు లేమిగలవై
సింహపు పిల్లలు లేమిగలవై - ఆకలిగొనునేమో గానీ
నిన్ను ఆశ్రయించిన ఈ నా బ్రతుకులో - ఏమేలూ కొదువలేదయ్యా
నాయేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా
|| సింహపు ||
1. పిలిసితే పలికేవు, అడిగితే ఇచ్చేవు
అలసిన నా బ్రతుకును ఆనందపరిచేవు
నీ మాట వజ్రాల మూట, నా యేసయ్యా
నా బ్రతుకు ద్రాక్షల తోట
|| సింహపు ||
2. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్య
నిత్యము తోడుండి నడిపించేవయ్య
నా జీవ జలముల ఊట, యేసయ్యా
నీవే నా బంగారుకోట
|| సింహపు ||
3. శక్తి హీనులకు బలాబివృద్ధి చేసి
సోమ్మసిల్లు ప్రాణమును నీ శక్తితో నింపి
నీ పలుకు తేనెల ఊట, యేసయ్యా
నీ బాట వెన్నెల బాట
|| సింహపు ||
4. విరిగిన నా హృదయం నీకే బలియాగం
నలిగిన నా ఆత్మే సర్వాంగ హోమం
నీవే నా ఆశ్రయకోట, యేసయ్యా
ఆశీర్వదపు ఊట
|| సింహపు ||
0 కామెంట్‌లు